

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఎలాంటి విధానంతో కేటాయించాలన్న దానిపై ఈ ఉత్తర్వుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఇదే విధంగా, సర్పంచ్ పదవుల్లో కూడా బీసీ వర్గాలకు వారి కులగణనను బట్టి రిజర్వేషన్లు కేటాయించబడతాయి.
2011 జనాభా లెక్కలను ప్రమాణంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సర్పంచ్ స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ప్రతి మండలంలో సర్పంచ్ స్థానాల తుది రిజర్వేషన్ జాబితాను ఆయా ఆర్డీవోలు సిద్ధం చేసి ప్రకటించనున్నారు.
ఈ జీవో విడుదలతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్పష్టత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!