

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం 205 అన్న క్యాంటీన్ల ద్వారా అన్నార్థుల ఆకలిని తీర్చుతున్నామని, త్వరలో మరిన్ని క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ ద్వారా అందరికీ ఇళ్లు, గిరిజన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, మైనార్టీల సంక్షేమానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చడం, యువతకు ఉద్యోగాల కల్పన, టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్‌గ్రేడ్, జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, పేదల కోసం రూ.25 లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, తల్లికి వందనం పథకం అమలు, ఏపీని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చే చర్యలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!