

జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు, చర్యలపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు జిల్లాల్లో జోగి రమేష్‌పై కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఆయన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, జోగి రమేష్ ప్రస్తుతం నకిలీ మద్యం తయారీ కేసులో కండీషన్ బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించినట్టుగా తాజా పరిణామాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. వరుస కేసులు నమోదవడం, తాజా ఘటనల నేపథ్యంలో జోగి రమేష్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసే ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో జోగి రమేష్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!