
.png&w=3840&q=75)
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ తన అనుబంధ సంస్థ రైడెన్‌తో కలిసి విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి రాష్ట్రానికి రానుందని, వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ విశాఖ నగర రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని ఐటీ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.
అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్ష వైసీపీ ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. చివరికి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను స్వాగతిస్తూ, ఇది విశాఖలో ప్రత్యేక ఎకో సిస్టమ్ ఏర్పరుస్తుందని అన్నారు.
ఈ స్పందనతో టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. జగన్ మాట్లాడుతూ, విశాఖలో హోటళ్ల నిర్మాణం పెరుగుతుందని, రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని, భూముల విలువలు కూడా పెరుగుతాయని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, తాను గుడ్డిగా ఎవరినీ వ్యతిరేకించనని తెలిపారు.
అయితే, జగన్ బాధ కూడా వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు తన ప్రభుత్వ కాలంలోనే బీజం పడిందని, కానీ చంద్రబాబు దానిపై తనకు క్రెడిట్ ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గూగుల్‌తో పాటు అదానీ గ్రూప్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అని, వారు సుమారు ₹87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు.
తమ ప్రభుత్వం కాలంలో స్థానికంగా 25,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని, ఆ విషయం ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తావించకపోవడం బాధకరమని జగన్ పేర్కొన్నారు.
ఏదేమైనా, జగన్ ఈ ప్రాజెక్ట్‌ను స్వాగతించడం టీడీపీ నేతలకు ఊరట కలిగించింది.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!