

2027 వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రకటించిన కొత్త ఫార్మాట్‌పై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అసోసియేట్ దేశాల కెప్టెన్లు, ఆటగాళ్లు ఈ విధానం చిన్న జట్ల అవకాశాలను తగ్గిస్తుందని విమర్శిస్తున్నారు. ప్రపంచ క్రికెటర్ల సంఘం ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించిన వారు, ఈ నిర్ణయం క్రికెట్ విస్తరణ లక్ష్యాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కొత్త విధానం ప్రకారం, తక్కువ ర్యాంకులో ఉన్న మూడు అర్హత సాధించిన జట్లు ముందుగా సూపర్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. అందులో విజేతగా నిలిచిన ఒకే ఒక్క జట్టుకు ప్రధాన ప్రపంచకప్‌లో చోటు దక్కనుంది.
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ తదితరులు ఈ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచకప్ అవకాశాలు చిన్న దేశాల క్రికెట్ అభివృద్ధికి కీలకమని, అవకాశాలను తగ్గించడం కంటే పెంచాలని వారు కోరారు. ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఐసీసీకి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!