

ఐపీఎస్ మాజీ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఆయన మేఘా ఇంజినీరింగ్‌కు అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘ఒలెక్ట్రా’ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు వాహనాలను సరఫరా చేస్తోంది.
వైఎస్సార్ సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసు దర్యాప్తు సమయంలో జేడీ లక్ష్మీ నారాయణ పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అనంతరం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన తరఫున విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయారు. తరువాత స్వంతంగా పార్టీ స్థాపించినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి కార్పొరేట్ రంగాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!