

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం మరియు పుదుచ్చేరి శాసనసభలకు సంబంధించిన ఎన్నికల తేదీలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు వెల్లడించనున్నారు. దీనికి సంబంధించిన మీడియా సమావేశం న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో జరగనుంది.
ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈసీ బృందాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సన్నద్ధతను పరిశీలించాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహిస్తారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!