

టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షో ఫేమ్ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ నేత రామచందర్‌రావు శ్రష్టి వర్మకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు యువతీయువకులు, కళాకారులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి సమాజ హితం కోసం పనిచేయాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
బీజేపీలో చేరిన అనంతరం శ్రష్టి వర్మ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆలోచనలకు ఆకర్షితురాలై సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇది కేవలం పార్టీ సభ్యత్వం మాత్రమే కాదని, ఒక బాధ్యతగా భావించి పనిచేస్తానని పేర్కొన్నారు. ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొందిన శ్రష్టి వర్మ అనంతరం సినిమాల్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!