
సినిమాలు

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. సమ్మిట్ జరుగుతున్న సమయంలో అక్కడికి దూసుకెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ చర్యపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు గుప్పించింది.
ఈ ఘటనతో రాజకీయ దుమారం మరింత పెరిగింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ యువమోర్చా ప్రయత్నించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఏఐ సమ్మిట్‌లో జరిగిన ఈ నిరసనపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!