

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిసెంబర్ 6న అమెరికా డాలస్ నగరాన్ని సందర్శించనున్నారు. పర్యటన సందర్భంగా ఆయన అనేక ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొని ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా, డాలస్ ఎన్నారై టీడీపీ నాయకులు, సభ్యులు కలిసి యువనేత కోసం భారీ సభను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పదివేల మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
గత ఆదివారం సాయంత్రం డాలస్లో ఎన్నారై టీడీపీ సమావేశం జరిగింది. దాదాపు వందమందికి పైగా సభ్యులు ఇందులో పాల్గొని సభ ఏర్పాట్లపై చర్చించారు. సభ విజయవంతంగా నిర్వహించేందుకు స్టీరింగ్ కమిటీతో పాటు భద్రత, ఆహారం, స్వాగతం, వేదిక అలంకరణ వంటి విభాగాల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న సభ్యులు తమ పేరు, కాంటాక్ట్ వివరాలను ఇవ్వడానికి ప్రత్యేక లింక్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ ప్రక్రియలో భాగంగా స్టీరింగ్ కమిటీలో పలువురు కీలక సభ్యులను నియమించారు.
లోకేష్ పర్యటనతో అమెరికాలోని తెలుగు ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. డాలస్ సభను జ్ఞాపకంగా మిగిలే విధంగా నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ బృందం కృషి చేస్తోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!