
సినిమాలు

చెన్నైలో వామపక్ష పార్టీల కీలక సమావేశం సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. టీవీకే నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని వామపక్షాలను కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో మంతనాలు కొనసాగిస్తోంది. అదే సమయంలో డీఎంకే నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీసీకే సమావేశం పూర్తయ్యాకే తుది నిర్ణయం వెల్లడించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!