

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు), జెడ్పీటీసీ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం, అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, అభ్యర్థులు అక్టోబర్ 27 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
అక్టోబర్ 27న పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్ల గడువు, అవసరమైన పత్రాలు, ఇతర ఎన్నికల నిబంధనలను సంబంధిత అధికారుల నుంచి తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!