
గాసిప్స్

వైసీపీ అగ్రనేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు.
రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై మొత్తం 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయన పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిశీలించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!