4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాపై ఇంత పెద్ద ఆరోపణా ? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ

Writer: Sreekanth Reddy 09:58 AM, 10 ఫిబ్రవరి, 2026
మాపై ఇంత పెద్ద ఆరోపణా ? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ

తమ నుంచి ప్రధాని మోదీ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందిందని.. అందుకే గత గురువారం లోక్‌సభకు రావద్దని ఆయనకు తానే సూచించానని స్పీకర్‌ ఓం బిర్లా చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు మండిపడ్డారు. తమపై ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభకు రాని ప్రధానిని సమర్థించే క్రమంలో ఆయన అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనయ్యారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయనకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని జవాబు ఇవ్వకుండానే గత గురువారం లోక్‌సభ అసాధారణ రీతిలో తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. బుధవారం(4న) సాయంత్రమే ఆయన ప్రసంగించాల్సి ఉండగా.. గందరగోళం కొనసాగడం.. ప్రతిపక్షానికి చెందిన కొందరు మహిళా ఎంపీలు మోదీ రాకముందే ఆయన సీటు వద్ద మోహరించారు. ప్యానెల్‌ స్పీకర్‌, మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎన్ని సార్లు విజ్ఞప్తిచేసినా వారు వెనక్కి రాలేదు. దాంతో ప్రధాని ప్రసంగం గురువారాని(5వ తేదీ)కి వాయిదాపడింది. కానీ విపక్షాలు, అధికార పార్టీ సభ్యుల పరస్పర నినాదాలతో ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటిస్తూ.. మహిళా విపక్ష ఎంపీలపై పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై వారు సోమవారం వారు లేఖ రాశారు. దానిపై సంతకం చేసిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానిపై చెయ్యెత్తడం గానీ, మరేదైనా గానీ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 11 మంది మహిళా ఎంపీలున్నారు. స్పీకర్‌ ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సింది కాదు. ఆ రోజున సభకు వచ్చే ధైర్యం మోదీకి లేదు. అందుకే ఆయన తరఫున స్పీకర్‌తో అలా వివరణ ఇప్పించారు. ఇది తప్పు’ అని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

ట్యాగ్లు
పార్లమెంట్ప్రియాంకగాంధీస్పీకర్ ఓం బిర్లాప్రధాని మోడీపార్లమెంట్ బడ్జెట్ సెషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!