
గాసిప్స్

రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మరోసారి ఆధిపత్యం చాటారు. మొత్తం 4,333 సర్పంచి స్థానాల్లో సగానికి పైగా గెలిచి విజయదుందుభి మోగించారు. 27 జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి గట్టి పోటీ ఇచ్చినా రెండో స్థానానికే పరిమితమైంది. స్వతంత్రులు మూడో స్థానంలో నిలవగా, నిర్మల్ జిల్లాలో భాజపా మద్దతుదారులు అత్యధిక స్థానాలు సాధించారు.
అర్ధరాత్రి 12.30 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్కు 2,297 (51.9%), బీఆర్ఎస్కు 1,191 (27.5%), భాజపాకు 257 (6.2%), ఇతరులకు 578 (14.4%) స్థానాలు లభించాయి.
రెండో దశలో 85.86 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. చలిని సైతం లెక్కచేయకుండా గ్రామీణ ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!