
జనరల్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. టీవీకే పార్టీకి మద్దతు విషయంలో కాంగ్రెస్ కీలక షరతులు పెట్టినట్లు సమాచారం. మతతత్వ పార్టీలతో కలవకూడదని కాంగ్రెస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సీపీఎం కేవలం బయట నుంచి మాత్రమే మద్దతు ఇవ్వాలని నిర్ణయించగా, సీపీఐ మాత్రం టీవీకేకు బేషరతు మద్దతు ప్రకటించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వామపక్ష పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతు ఇస్తామని, కేబినెట్లో చేరబోమని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని తమకు కేటాయించాలని వీసీకే టీవీకేకు షరతు పెట్టింది. వీసీకే అధినేత తిరుమావళవన్ ఆ స్థానంలో నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!