

తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వరుస కీలక నిర్ణయాలతో పాలన ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మూడు ప్రధాన హామీల అమలుకు తొలి సంతకాలు చేశారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల భద్రత, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక బృందం తన పర్యవేక్షణలో పనిచేస్తుందని విజయ్ ప్రకటించారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే విజయ్ వరుస రాజకీయ భేటీలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ నివాసానికి వెళ్లనుండగా, అనంతరం ఎండీఎంకే నేత వైకో ను కలవనున్నట్లు సమాచారం. ఇవి మర్యాదపూర్వక భేటీలేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి ని విజయ్ కలుస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొత్త అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా, డీఎంకే ఉదయనిధిస్టాలిన్ ను ప్రతిపక్ష నేతగా ప్రకటించింది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!