

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను పెంచిన తర్వాత ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ మరియు యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ధరలను కూడా పెంచింది. ఈ ధరల పెంపు వ్యక్తిగత, ఫ్యామిలీ మరియు స్టూడెంట్ యూజర్లపై ప్రభావం చూపనుంది. మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ వెల్లడించింది. భారత్‌తో పాటు అమెరికా, యూరప్ మార్కెట్లలో కూడా ఈ పెంపు అమల్లోకి వచ్చింది.
సవరించిన ధరల ప్రకారం, యాపిల్ మ్యూజిక్ వ్యక్తిగత ప్లాన్ నెలకు రూ.119 నుంచి రూ.139కి పెరిగింది. ఫ్యామిలీ ప్లాన్ రూ.179 నుంచి రూ.229కు, స్టూడెంట్ ప్లాన్ రూ.59 నుంచి రూ.69కు పెరిగింది. యాపిల్ వన్ ప్లాన్ ధరలు కూడా పెరిగాయి. వ్యక్తిగత ప్లాన్ రూ.175 నుంచి రూ.195కు, ఫ్యామిలీ ప్లాన్ రూ.235 నుంచి రూ.295కు, ప్రీమియం ప్లాన్ రూ.899 నుంచి రూ.995కు పెంచారు. ఈ కొత్త ధరలు యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!