

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో గంటసేపు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు సాగిన ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో జనం నాడిపై చర్చించిన సీఎం.. ఇవ్వాళ, రేపు అనుసరించాల్సిన "పోల్ మేనేజ్మెంట్" వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. రేపు, ఎల్లుండి తాను మంత్రులకు పూర్తి అందుబాటులో ఉంటానని, స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టడం, ఆ పార్టీ ప్రభావాన్ని అడ్డుకోవడంపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, ఎక్కడా లోపాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!