
క్రీడలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. అదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా కోర్టు కీలక ఉపశమనం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్, కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులపై తప్పు జరిగిందని నిరూపించే ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు క్లీన్ చీట్ ఇస్తూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేసింది. అలాగే మాజీ మంత్రి మనీష్ సిసోడియాను కూడా డిశ్చార్జ్ చేస్తూ, నిందితులపై చేసిన అభియోగాలకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!