
జనరల్

విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు సదస్సు ప్రాంగణంలో స్వాగతం పలికారు. అనంతరం నేతలంతా ప్రాంగణంలో కలియ తిరుగుతూ వివిధ కళాబృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలను తిలకించారు.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌తో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంప్రదాయ డోలు వాయించి సందడి చేశారు. ఈ దృశ్యం అక్కడికి వచ్చినవారి దృష్టిని ఆకర్షించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!