

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లోకి రానుంది. ఇంటర్ బోర్డు గతంలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా ఇంటర్నల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను గురువారం విడుదల చేసింది. గత ఏడాది తొలిసారిగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ సబ్జెక్టులో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టగా, ఈసారి అన్ని సబ్జెక్టులకు విస్తరించనున్నారు.
విద్యార్థుల ప్రతిభను రాత పరీక్షలతో పాటు ప్రయోగాత్మక పరీక్షలు, అంతర్గత మూల్యాంకనం ద్వారా కూడా అంచనా వేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష తెలిపారు. అయితే ద్వితీయ భాషగా కన్నడ, తమిళం, మరాఠీ తీసుకున్న విద్యార్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న పాత విధానమే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో సైన్స్ గ్రూపులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!