
న్యూస్

మహిళలకు రాజకీయ ప్రతినిధిత్వం పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ చట్టం ప్రకారం లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించేలా నిబంధనలు ఉన్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష నేతలతో కేంద్రం అనౌపచారిక చర్చలు కూడా ప్రారంభించినట్లు సమాచారం.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం జనగణన పూర్తి అయిన తర్వాత మరియు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే ఈ రిజర్వేషన్ అమల్లోకి రావాలి. కేంద్రం కొత్త జనగణనను 2026–27లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుందన్నది స్పష్టంగా లేదు. అందువల్ల మహిళా రిజర్వేషన్ త్వరగా అమలు చేయడానికి పునర్విభజన అవసరాన్ని చట్టం నుంచి తొలగించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.






.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!