
గాసిప్స్

వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజని పై కేసు నమోదైంది. జనవరి 30 న విడదల రజని అనుచరులు, తెదేపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెదేపా నేతల ఫిర్యాదుతో యడ్లపాడు పోలీసులు రజని సహా 21 వైకాపా నేతలపై కేసు నమోదు చేశారు.
మరోవైపు వినుకొండలో మాజీ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కూడా కేసు నమోదు అయ్యింది. జనవరి 31 న స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బొల్లా మరియు వైకాపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఘర్షణలో ఒక కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే సహా 27 నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!