

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చలకు బీజేపీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యం వహించనుండగా, అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళని స్వామి, సీనియర్ నేతలు పాల్గోనున్నారు.
కాగా, 2024 ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన 11 శాతం ఓట్ షేర్ ఆధారంగా బీజేపీ బేరసారాలు జరుపనున్నట్టు తెలుస్తోంది. 50 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు టీటీవీ దినకరన్ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' (ఏఎంఎంకే), మరో రెండు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన దినకరన్ 2018లో ఏఎంఎంకే పార్టీని స్థాపించారు. ఎన్డీయేలోకి తిరిగి రావడానికి బీజేపీనే కారణమని, ఆ పార్టీతోటే తాను సీట్ల సంప్రందింపులు సాగిస్తానని దినకరన్ స్పష్టం చేశారు








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!