

కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై కూడా దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉదయం నిర్వహించిన ప్రెస్మీట్లో కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!