
జనరల్

ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం కంది శ్రీనివాస్ రెడ్డి మానుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండ్రాల నగేష్ విమర్శించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కలిసి కాంగ్రెస్–బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ విజయం ఖాయమని తెలుసుకుని కొందరు ఆరోపణల రాజకీయాలు చేస్తున్నారని ఎండ్రాల నగేష్ పేర్కొన్నారు. బీజేపీలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి, ఇప్పుడు మాట మార్చడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు నిజాయితీగా పనిచేసే నాయకులనే నమ్ముతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జోగు రవి, గంట జీవన్, దినేష్ మాటోలియా తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!