
.jpg&w=3840&q=75)
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ప్రజాభవన్లో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులను కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఎత్తి చూపాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన విధానాల పై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
అధికారులు 12 శాఖలకు సంబంధించిన 47 కీలక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తో పాటు బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సీఎస్ రామకృష్ణ రావు హాజరయ్యారు.
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు తీవ్రమైన చర్చలతో కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టడం పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని పార్లమెంట్ లో బలంగా తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.


.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!