
గాసిప్స్

బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందించాలి, వృద్ధులు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్లు పెంచాలి, కళ్యాణ లక్ష్మీ పథకంతో పాటు తులం బంగారం ఇవ్వాలి, అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు.
ఆందోళన అనంతరం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య గారికి కవిత వినతిపత్రం అందజేశారు. మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అంగన్ వాడీ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!