
గాసిప్స్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12 న నమోదైన కేసులో ఆయనకు ఈ బెయిల్ లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ కేసు నమోదు అయింది.
ఆ ర్యాలీ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల కస్టడీకి తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో అంబటికి బెయిల్ మంజూరు అయింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!