

వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై జరిగిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కర్రలు, రాడ్లు తీసుకుని తన కారును అడ్డగించి దాడికి ప్రయత్నించారని, తనను తీవ్రంగా దూషించారని ఆయన ఆరోపించారు. వారు తిడుతున్న సమయంలో ఆవేశంలో తాను కూడా స్పందించానని, ఆ సందర్భంలో తన మాటలు తూలాయని తెలిపారు.
తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణలు కూడా చెప్పానని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ గుంపులుగా వచ్చి తన ఇంటిపై దాడి చేశారని, ఆ సమయంలో ఇంట్లో పిల్లలు, మనవళ్లు ఉన్నారని చెప్పారు. పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారని ఆరోపించారు.
ఈ ఘటనలో తనను 18 రోజుల పాటు జైలులో ఉంచారని, తనపై ప్రతీకార చర్యలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. అసభ్యంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ దాడులు చేయడం సమంజసం కాదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!