
షోస్

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 12 కార్పొరేషన్లలో, జనసేన ఐదు కార్పొరేషన్లలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక కార్పొరేషన్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల పంపకంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమండ్రి కార్పొరేషన్ను బీజేపీకి కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. ఐదు కార్పొరేషన్లతో పాటు 23 మున్సిపాలిటీల్లోనూ జనసేన పోటీ చేయవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, సీట్ల కేటాయింపుపై పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!