

వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా ఆమె కొత్త సినిమాకు సంతకం చేయకపోవడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అవకాశాలు తగ్గడం వల్లే ఆమె విరామం తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, తన వద్దకు అనేక కథలు వస్తున్నాయని మృణాల్ వెల్లడించినట్లు సమాచారం. అయితే, వాటిలో తనకు నచ్చిన కథ, ప్రత్యేకమైన పాత్ర కనిపించకపోవడంతోనే సినిమాలకు అంగీకరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం బిజీగా కనిపించాలనే ఉద్దేశంతో వరుసగా సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని తెలిపారు.
తన తదుపరి చిత్రం సృజనాత్మక సంతృప్తిని ఇవ్వడంతో పాటు నటిగా మంచి గుర్తింపును తీసుకురావాలని మృణాల్ కోరుకుంటున్నారు. తెరపై తన పాత్రను చూసి గర్వపడేలా ఉండాలని భావిస్తున్న ఆమె, సరైన కథ కోసం ఎదురుచూడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే తొందరపడి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడం లేదని తెలుస్తోంది. తన అభిరుచికి సరిపోయే కథ దొరికిన తర్వాతే కొత్త సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. మృణాల్ కెరీర్లో ఈ విరామం ఎలాంటి మార్పులకు దారితీస్తుందో, ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!