

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆట మరింత ఆసక్తికరంగా మారింది. 38వ రోజు బిగ్‌బాస్ వారికి ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లోని ఓజీ కంటెస్టెంట్స్ వ్యక్తిత్వాలను గమనించి, వారి ప్రవర్తనకు తగిన పేర్లు పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ అనే ట్యాగ్ ఇచ్చారు. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ గొడవలకు కారణమవుతాడనే అభిప్రాయంతో ఈ పేరు పెట్టినట్లు సమాచారం. షాలినికి ‘విక్టిమ్ కార్డు’, ముఖేష్‌కు ‘మానిప్యులేటర్’ అనే బిరుదులు ఇచ్చారు. ఝాన్సీకి ‘బ్యాక్స్టాబర్’, దేబ్జానీకి ‘సేఫ్ ప్లేయర్’ అనే ట్యాగ్లు ఇవ్వగా, వర్షిణికి ‘బ్రెయిన్లెస్’ అనే పేరు పెట్టారు. ఇవన్నీ టాస్క్‌లో భాగంగా వైల్డ్ కార్డు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
ఆ తర్వాత బిగ్‌బాస్ ఓజీ కంటెస్టెంట్స్‌ను బ్లూ, గ్రీన్ జట్లుగా విభజించి మరో గేమ్ నిర్వహించారు. రెండు జట్ల నుంచి ఒక్కొక్కరు ముందుగా గంట మోగించి, వైల్డ్ కార్డు సభ్యులు ఇచ్చిన ట్యాగ్‌లకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరైన సమాధానాలకు పాయింట్లు లభిస్తాయి. ఇదిలా ఉండగా, రామకృష్ణ–షాలిని మధ్య జరిగిన గొడవ కూడా చర్చనీయాంశమైంది. టాస్క్‌లో భాగంగా షాలినిని అడ్డుకునే సమయంలో రామకృష్ణ తనను గట్టిగా తోశాడని ఆమె భావించినట్లు సమాచారం. ఈ విషయాన్ని రోహిత్‌తో చెబుతూ షాలిని భావోద్వేగానికి గురైంది. అయితే కావాలని అలా చేయలేదని రామకృష్ణ వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ షాలిని బాధపడుతుండటంతో ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. శివకుమార్ కూడా జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ ట్యాగ్లు, గొడవలు హౌస్‌లోని సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, కంటెస్టెంట్స్ తమ ఆటతీరును మార్చుకుంటారో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!