

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 14 రెండో శనివారం సెలవుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దసరా పండుగ అక్టోబర్ 19న రావడంతో, పండుగకు ముందు రోజు సోమవారం కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అదనపు సెలవు ప్రకటించింది. అయితే, ఆ సెలవుకు బదులుగా నవంబర్ 14న రెండో శనివారం పనిచేయాలని తొలుత నిర్ణయించింది.
అయితే, అదనపు సెలవు రోజున రాష్ట్రంలోని పలువురు ఉద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఐఆర్ కార్యక్రమం, దసరా వేడుకలు, సరస్ మేళా తదితర విధుల్లో పాల్గొన్నారు. దీంతో నవంబర్ 14న యథావిధిగా రెండో శనివారం సెలవు ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని కోరింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం నవంబర్ 14న రెండో శనివారం సెలవు యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికలు, దసరా, సరస్ తదితర విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఆ రోజును సెలవుగా వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!