
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 6 వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 14 వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి, ప్రవేశపెట్టబోయే బిల్లులు, సభా కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. మొత్తం 16 రోజులపాటు అసెంబ్లీ పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు.
వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కీలక బిల్లులపై చర్చ జరగనుండగా, రాష్ట్ర ఆర్థిక స్థితి, అభివృద్ధి ప్రణాళికలపై సభలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!