
జనరల్

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు కోసం గత కొన్ని నెలలుగా ఆయన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకాలు వచ్చే రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. గత పనితీరు, అలాగే ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చూపిన చురుకుదనం ఆధారంగా ఈ నియామకాలు జరగనున్నాయి. వచ్చే వారం నూతన కమిటీల అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!