

అంబటి రాంబాబు ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తనపై నమోదైన అక్రమ కేసులు, టీడీపీ గూండాలు తన ఇంటిపై చేసిన ధ్వంసం, హత్యాయత్నం ఘటన, అలాగే పోలీసుల నిర్లక్ష్య వైఖరి మరియు కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా వాటిని ఎదుర్కొంటామని జగన్ భరోసా ఇచ్చారు.
ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్ సూచించారు. పార్టీ క్యాడర్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్ను కలిసిన వారిలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!