
.webp&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను గృహనిర్మాణ–పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యయ శాఖలు మరియు నీతి ఆయోగ్‌లకు పంపి అభిప్రాయాలు కోరింది.
న్యాయ శాఖ ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. మిగిలిన శాఖలు కూడా త్వరితగతిన స్పందించాలని హోం మంత్రిత్వశాఖ సూచించినట్లు తెలిసింది. క్యాబినెట్ నోట్‌కు మంత్రివర్గం ఆమోదం లభించిన అనంతరం న్యాయ శాఖ తుది బిల్లును సిద్ధం చేస్తుంది. ఆ బిల్లుకు మళ్లీ కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొదటి పదేళ్ల పాటు హైదరాబాద్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే అమరావతి కేంద్రంగా పరిపాలన ప్రారంభించింది. ఉమ్మడి రాజధాని గడువు 2024 జూన్ 2తో ముగియడంతో, ఆ తేదీ నుంచే అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధాని ఎంపిక విధానం, పరిపాలన కార్యకలాపాలు, నిర్మాణ పురోగతిపై పూర్తి నివేదికను కూడా కేంద్రానికి సమర్పించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!