
క్రీడలు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ “బీజేపీ వర్సెస్ సీజేపీ” అంటూ ఎక్స్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. నిరుద్యోగం, పరీక్షల వివాదాలు, పాలన సమస్యలపై యువతలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో ప్రారంభమైన వ్యంగ్య ఉద్యమం ఇటీవల వైరల్‌గా మారింది.
అమెరికాలో నివసిస్తున్న అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఈ ఉద్యమం ప్రధాన ఎక్స్ ఖాతా భారత్‌లో లీగల్ డిమాండ్ కారణంగా నిలిపివేయడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. అఖిలేష్ యాదవ్ చేసిన పోస్టును 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీపై పరోక్ష విమర్శగా పలువురు అభిప్రాయపడ్డారు. అనంతరం “బీజేపీ వర్సెస్ సీజేపీ” సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి విస్తృత చర్చకు దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!