

రాబోయే యూనియన్ బడ్జెట్ 2026 – 27 కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకుండా, దేశ టెక్నాలజీ భవిష్యత్తును నిర్ధారించే దిశగా ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ప్రీ - బడ్జెట్ సమావేశంలో నిపుణులు డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు ప్రత్యేక పాలసీ మద్దతు అవసరమని ప్రతిపాదించారు. ఈ రంగాల అభివృద్ధికి బడ్జెట్లో స్పష్టమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారు అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, సంప్రదాయ ఐటీ అవుట్ సోర్సింగ్కే పరిమితం కాకుండా అధిక విలువ కలిగిన డిజిటల్, నాలెడ్జ్ బేస్డ్ సేవల వైపు భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. డేటా సెంటర్లు డిజిటల్ ఎకానమీకి కీలకమైన మౌలిక సదుపాయాలని, క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్టెక్, ఈ - కామర్స్ వంటి రంగాలు వీటిపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు పన్ను మినహాయింపులు, భూమి కేటాయింపులు వంటి ప్రోత్సాహకాలు అందించాలని వారు సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!