
క్రీడలు

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఈ నెల 15 వ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. వి. మునిరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఆహా ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను చేరుకోనుంది. ఆహా గోల్డ్ యూజర్లు 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి స్పందన పొందుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!