

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్, జీ5, ఆపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫాంలు రెడీ అయ్యాయి. స్పై థ్రిల్లర్ నుంచి పీరియడ్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, హారర్, కామెడీ, డాక్యుమెంటరీ వరకు అన్ని జానర్స్‌లో కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’, ‘చాంపియన్’, ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’ వంటి హైప్ ఉన్న టైటిల్స్ విడుదలవుతుండగా, ప్రైమ్ వీడియోలో ‘వా వాత్తియార్’, ‘ది రెక్కింగ్ క్రూ’, ‘దల్దల్ సీజన్ 1’ వంటి మూవీస్, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
జియో హాట్‌స్టార్‌లో ‘సర్వం మాయా’, ‘వండర్ మాన్ సీజన్ 1’, ‘ట్రాకర్ సీజన్ 3’ వంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుండగా, తెలుగులో ‘డ్రైవ్’ (ఆహా వీడియో), ‘కానిస్టేబుల్’ (ETV Win) వంటి సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యాక్షన్, థ్రిల్లర్ ప్రేమికులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా ఈ వారం ఓటీటీల్లో చూసేందుకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!