

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ పై ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇండో-హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదిలా ఉండగా, ఆమె నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటిటిలోకి వచ్చేసింది.
ఆ సినిమా పేరు ది బ్లఫ్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసిద్ధమైన వెబ్ సిరీస్ ది బాయ్స్ లో నటించిన కార్ల్ అర్బన్ హీరోగా, దర్శకుడు ఫ్రాంక్ ఈ. ఫ్లవర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రం ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు డబ్బింగ్ సహా మొత్తం 19 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రియాంక చోప్రా నటించిన ఈ కొత్త యాక్షన్ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!