

రాకాస చిన్న సినిమాగా విడుదలై థియేటర్లలో మంచి మౌత్ టాక్తో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ వ్యూస్ సాధించి టాప్-7లో నిలిచింది.
దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలను వినూత్నంగా మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ టైమింగ్, సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సినిమాలకు ఓటీటీ ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు ఎలా వస్తుందో ‘రాకాస’ మరోసారి నిరూపించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!