
సినిమాలు

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించగా, నిరంజన్ హీరోగా కనిపించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో సన్ నెక్స్ట్ ఈ నెల 20, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ధ్రువ సర్జా అతిథి పాత్రలో కనిపించగా, శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!