
జనరల్

దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సతి లీలావతి’ చిత్రం త్వరలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఈ నెల 8న థియేటర్లలో విడుదలైంది.
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ సొంతం చేసుకోగా, ఈ నెల 20 నుంచి ప్రసారానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. నరేష్, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!