

మాస్ మహారాజా రవితేజ హీరోగా సంక్రాంతికి విడుదలైన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి త్వరలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డిజిటల్ విడుదలపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా జీ5 (ZEE5) అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించారు.
ఈ సినిమా కథ రామ్ సత్యనారాయణ (రవితేజ), అతని భార్య బాలామణి (డింపుల్ హయాతి) చుట్టూ తిరుగుతుంది. తన భర్తపై బాలామణికి అపారమైన నమ్మకం ఉంటుంది. వ్యాపార పనుల కోసం రామ్ స్పెయిన్ వెళ్లినప్పుడు అక్కడ మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో పరిచయం ఏర్పడుతుంది. తనకు పెళ్లయ్యిందనే విషయం దాచిపెట్టి తనను సత్యగా పరిచయం చేసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్య చూపుతున్న ప్రేమ చూసి అతనికి అప్పుడప్పుడు అపరాధ భావన కలుగుతుంది. అయితే స్పెయిన్ నుంచి మానస ఇండియాకు రావడంతో పరిస్థితులు ఎలా మారాయి? వారి బంధం కొనసాగిందా? అనేదే ఈ చిత్ర కథ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!