

ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇసకపట్నం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్‌ల సిరీస్‌ను తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఇసకపట్నంలో నేరాలు, రాజకీయాలు, అధికారం కోసం పోరాటం, ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. భావోద్వేగాలు, ఉత్కంఠభరిత మలుపులు, యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఆశ, అధికారం, స్వార్థం, నమ్మకద్రోహం వంటి అంశాలు కథను ముందుకు నడిపిస్తాయని దర్శకుడు గ్యారీ బీహెచ్ తెలిపారు. తమ పాత్రలలో ఉన్న భావోద్వేగ గాఢత, సంక్లిష్టత ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!