

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఆగస్టు 6న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్‌తో పాటు సినిమా కొత్త విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
1 నిమిషం 35 సెకన్ల నిడివితో రూపొందిన ఈ టీజర్ సినిమా స్థాయి, కథా నేపథ్యంపై ఆసక్తి పెంచుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మొదట ఆగస్టు 21న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు సమాచారం. రాఘవ్ జుయల్, మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత సినిమా కథ, విడుదలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!